Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ మారడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటంటే... : కార్యకర్తలతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (15:07 IST)
సొంత పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం గత రెండు రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాచర్ల, గిద్దలూరు నేతలతో సమావేశమైన ఆయన, నేడు బెస్తవారిపేట, కొమరోలు గ్రామాలకు చెందిన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
 
ఈ సమావేశాల్లో ఆయన అడుగుతున్న ప్రశ్నలు విని అనుచరులు విచిత్రంగా చూస్తున్నారు. పార్టీ మారితే మీరంతా నా వెంట నడుస్తారా? టీడీపీలో మనకు సముచిత స్థానం లభిస్తుందా?, మీకు స్థానిక టీడీపీ నేతలకు ఘర్షణలు జరుగుతాయా? వంటి ప్రశ్నలు సంధిస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతున్నారు. 
 
అదేసమయంలో టీడీపీలోకి వెళ్లితే తనకు, కార్యకర్తలకు కలిగే ప్రయోజనలను వివరిస్తున్నారు. ఆయన మాటలను ఆలకించిన అత్యధిక కార్యకర్తలు పార్టీ మారదామనే వెల్లడించగా, కొందరు మాత్రం ఇప్పుడున్న టీడీపీ నేతలతో గొడవలు వస్తాయని, అందువల్ల తొందరపడొద్దని సలహా ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే మాత్రం పార్టీ మారాలని ఎపుడో నిర్ణయించుకోవడంతో తిరుపతి మహానాడు ముగిసిన తర్వాత ఈ నెలాఖరున విజయవాడలో సీఎం సమక్షంలో పచ్చ కండువా కుప్పుకోవాలని భావిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments