దేశవ్యాప్తంగా లాక్ డౌన్ క్రమంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా..వంట గ్యాస్ సరఫరా సంస్థలు సిలిండర్ల డెలివరీ పద్దతిలో మార్పు చేశాయి. డోర్ డెలివరీకి బదులు ‘గేట్ డెలివరీ‘ చేయనున్నాయి.
డోర్ డెలివరీ పద్దతిలో డెలివరీ బాయ్స్ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాదకరంగా మారినందున.. ‘గేట్ డెలివరీ’గా మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ వంటగ్యాస్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పటికే ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కూడా ఇప్పడు ఇదే పద్దతి ఫాలో కానుంది.