Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి విక్రయిస్తున్న సెక్యూరిటీ గార్డులు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (07:53 IST)
దేశంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో గంజాయి కలకలం సృష్టించింది. ఇక్కడ పని చేసే సెక్యూరిటీ గార్డులే ఈ గంజాయిని విక్రయిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన యూనివర్శిటీ పోలీసులు నలుగురు సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. అలాగే, రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
 
యూనివర్శిటీలో గత కొన్ని రోజులుగా మత్తు పదార్థాలు విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు మఫ్టీలో నిఘా వేశారు. ఈ క్రమంలో పక్కా సమాచారంలో విశాఖ త్రీ టౌన్ పోలీసులు గత శుక్రవారం రాత్రి గంజాయి ఉందన్న సమాచారంతో బీచ్ రోడ్డులో ఉన్న యోగా విలేజ్‌లో ఆగివున్న ఓ ఆటోలో సోదాలు చేశారు. 
 
ఇందులో చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందాలో ఏయూ భద్రతా అధికారి కారు డ్రైవర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఈయన సహకారంతో సెక్యూరిటీ గార్డులు ఈ గంజాయిని విద్యార్థులకు చేరవేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments