Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఆర్టీసీ బస్సులో... తడ వ‌ద్ద గంజాయి పట్టివేత

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (19:37 IST)
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలం, బీవీ పాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద  శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చేపట్టిన వాహన తనిఖీలలో 12 కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఆర్ యు వి ఎస్ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు ఆదేశాల ప్రకారం వివిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద వాహన తనిఖీలు చేప‌ట్టారు. నెల్లూరు నుండి చెన్నైకి వెళుతున్నతమిళనాడు ఆర్టీసీ బస్సులో  ప్రయాణిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన శంకత్ అలీ, శన్వస్ ఇద్దరు వ్యక్తుల నుండి 12 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

 
పట్టుబడిన వ్యక్తులు విచారించగా ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం ప్రాంతం నుండి  కొనుగోలు చేసిన 12 కేజీల గంజాయిని కేరళ రాష్ట్రంలో కేజీ 20 వేల చొప్పున విక్రయిస్తున్న‌ట్లు విచారణలో నిందితులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సి ఐ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్  సిఐతో పాటు ఎస్ ఐ ప్రతాప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ ఎన్ రసూల్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పి వెంకటేశ్వర్లు ఎం ప్రభాకర్ రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments