Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్ నయీం అకృత్యాలు : మాట వినలేదని నిద్రమాత్రలు వేసి మైనర్‌ బాలిక హత్య

గ్యాంగ్‌స్టర్ నయీం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మైనర్ బాలిక మాట వినలేదనీ నిద్రమాతలు వేసి హత్య చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (09:41 IST)
గ్యాంగ్‌స్టర్ నయీం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మైనర్ బాలిక మాట వినలేదనీ నిద్రమాతలు వేసి హత్య చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న నస్రీన్ (17)కు నిద్రమాత్రలు వేసి చంపేశాడు. ఒకరోజు బంధువు అలీముద్దీన్ కూతురు అహెలా పెళ్లిచూపుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు నయీం, ఇంట్లోని వారు సిద్ధమయ్యారు. ఆసమయంలో అల్కాపురిలోని ఇంట్లో ఉండేందుకు నస్రీన్ నిరాకరించింది. ఇదేవిషయమై చిన్నపాటి గొడవ జరగడంతో ఇంటిపై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది.
 
నయీం నస్రీన్‌ను గదిలోకి తీసుకొచ్చి.. తీవ్రంగా కొట్టి.. నిద్రమాత్రలు మింగించాడని, తర్వాత అందరం కలిసి పెళ్లిచూపులకు వెళ్లినట్లు ఫయీం పోలీసులకు వెల్లడించాడు. ఫంక్షన్‌ నుంచి అర్థరాత్రి తిరిగొచ్చామని, నస్రీన్ చనిపోయినట్లు గుర్తించి నయీం, తాను, ఇతరులు కలిసి మృతదేహాన్ని రాత్రికిరాత్రి అల్కాపురికి సమీపంలోని మంచిరేవుల ప్రాంతంలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఫయీం ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం మంచిరేవుల ప్రాంతంలో రాజేంద్రనగర్‌ తహశీల్దార్‌, వైద్య బృందం సమక్షంలో తవ్వకాలు జరిపిన పోలీసులు.. ఓ అస్థిపంజరాన్ని బయటకు తీశారు. అది నస్రీన్‌దో కాదో తేల్చేందుకు డీఎనఏ పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. 
 
మరోవైపు... గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసుల్లో వాస్తవాలతోపాటు అతడు క్రూరంగా హత్యచేసినవారి అస్థిపంజరాలను పోలీసులు వెలికి తీస్తున్నారు. నయీం వ్యవహారంలో తెలంగాణవ్యాప్తంగా 34 కేసులు నమోదు చేసిన పోలీసులు.. నయీం కుటుంబ సభ్యులతోపాటు గ్యాంగ్‌కు చెందిన మొత్తం 38 మందిని అరెస్టు చేశారు. ఫర్హానా, అఫ్షా, ఫయీం, షహీన్‌ను కస్టడీకి తీసుకుని విచారించి... అల్కాపురిలో హత్యకు గురైనవారు, ఆచూకీ లేకుండా పోయిన వారి వివరాలు రాబడుతున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments