Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా గుంటూరు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (12:43 IST)
ఏపీలోని గుంటూరు నగర శివారు ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతున్నాయి. ఏ ప్రాంతంలో గ్యాంగ్ వార్ నానాటికీ పెరిగిపోతోంది. అల్లరి మూకల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నడిరోడ్డుపైనే దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ జిల్లాలోని మంగళగిరి రూరల్ పరిధిలో ఓ హోటల్ వద్ద అర్థరాత్రి సమయంలో టిఫన్, భోజనం సరఫరా చేయలేదన్న కోపంతో కొందరు యువకులు మద్యం సేవించి హోటల్‌ను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకున్న వాచ్‌మెన్‌ను కూడా కత్తితో పొడిచి భయభ్రాంతులకు గురిచేశారు. 
 
అలాగే, గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని స్వర్ణభారతి నగర్‌లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతం నగరానికి దూరంగా ఉడటం, జన సంచారం లేకపోవడంతో అక్కడ ఏం జరిగినా పోలీసులకు తెలియడం లేదు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. 
 
ఆ ప్రాంతంలోని రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకులు ఆధిపత్యం పోరులో భాగంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువకుడిని బంధించి తీవ్రంగా కొట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసుల్లో మాత్రం ఏమాత్రం చలనం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments