తూగో జిల్లాలో 50 యేళ్ళ మహిళపై గ్యాంగ్ రేప్!

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (14:12 IST)
నవ్యాంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో 50 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది. ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లాలోని జి. వేమవరంలో ఓ వివాహిత తన ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. ఈమె భర్త కుమారుడు మరణించగా, కుమార్తె హైదరాబాద్ నగరంలో నివసిస్తోంది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నారు.
 
షాద్ నగర్ దిశా ఘటన మరువకముందే మరో ఘటన
నిన్నటికి నిన్న షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన నేరస్తులపై దేశం భగ్గుమంటుంది. ఉరి తీయాలని డిమాండ్ చేస్తుంది. అలాంటి వారిని ప్రాణాలతో ఉంచితే సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తారని మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన జరిగి పట్టుమని 10 రోజులు కాకముందే మరో ఘటన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం