Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ కస్టడీలోకి చంద్రబాబు నాయుడు.. వైద్య పరీక్షలు పూర్తి

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (09:16 IST)
ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు చంద్రబాబు విచారణ ప్రారంభమవుతుంది. సీఐడీ విచారణ నేపథ్యంలో జైల్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలను పూర్తి చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే చంద్రబాబును విచారించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారించేందుకు కాన్ఫరెన్స్ హాలును అధికారులు సిద్ధం చేశారు. 
 
చంద్రబాబును తొమ్మిది మంది సీఐడీ అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులను కూడా అనుమతిస్తారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు వరుసగా 10వ రోజు కూడా చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments