Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో కరోనా విలయం.. మరో ఎమ్మెల్యే మృతి

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (12:15 IST)
బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయంసృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా మృత్యువాతపడుతున్నారు. తాజాగా జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరీ మహమ్మారితో పోరాడుతూ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
‘మేవాలాల్‌ గత వారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి పారాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారితో పోరాడుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు’ అని పార్టీ నేతలు తెలిపారు.
 
బీహార్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేవాలాల్‌ జేడీయూ తరపున తారాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జేడీయూ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. విద్యాశాఖ మంత్రిగా కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించారు. 
 
కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన నాలుగు రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు, కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో బీహార్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదివారం రాత్రి కర్ఫ్యూ విధించింది. 
 
అంతేకాకుండా మే 15 వరకు విద్యాసంస్థలు అన్ని మూసివేసేందుకు నిర్ణయించింది. మరోవైపు సంక్షోభ సమయంలోనూ విధులు నిబద్దతతో నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఒకనెల బోనస్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments