Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు తొలి అభ్యర్థన... ఏంటది?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:04 IST)
ఓడలు బళ్లవుతాయి... బళ్లు ఓడలవుతాయి అని మన పెద్దలు చెప్పే సామెత తెలిసిందే. రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువ. ఐదేళ్ల క్రితం దర్పంతో వుండే ముఖ్యమంత్రులు తదుపరి ఎన్నికల్లో ఏమీ లేకుండా అయిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే తయారైంది. ఇప్పటికే పార్టీలో ఓడిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. మరికొందరేమో... పార్టీ బాధ్యతలు అప్పజెపుతుంటే... మాకొద్దు అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇదీ అధికారం పోయిన తర్వాత పరిస్థితి. 
 
ఇక అసలు విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తొలిసారిగా ఓ అభ్యర్థన చేశారు. అదేమిటంటే.. తను ప్రస్తుతం వుంటున్న నివాసం పక్కనే వున్న ప్రజావేదికను తన అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలన్నది. ఎన్నికలకు ముందు తను ఏ గృహంలో అయితే వుంటున్నానో అదే ఇంట్లో తను వుండాలని నిర్ణయించుకున్నాననీ, దాని ప్రక్కనే వున్న ప్రజావేదిక ఖాళీగా వుండటంతో దాన్ని తన అధికారిక కార్యకలాపాలను జరుపుకునేందుకు ఇవ్వాలంటూ అభ్యర్థించారు. మాజీ సీఎం అభ్యర్థనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నారు. ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments