Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాష్ పాండ్ కాంట్రాక్టుల గోల... మైల‌వ‌రంలో బూడిద రాజకీయాలు

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:35 IST)
కృష్ణా జిల్లా మైల‌వ‌రంలో బూడిద రవాణా చేయడంలో సిద్ధ హస్తులుగా తెలుగు పార్టీ నేతలకు మంచి క్రేజ్ ఉంది. బూడిద అక్రమంగా ఎలా రవాణా చేయాలి, ఎలా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలో వారికి తెలిసినంతగా బహుశా ఇప్ప‌టి వైసీపీ అధికార పార్టీ నేతలకు కూడా తెలీని పరిస్థితి.
 
 
ఈ నేపథ్యంలో ఖిల్లా రోడ్ యాష్ పాండ్ తెలుగు నేతల కబంధ హస్తాల నడుమ నలుగుతూనే ఉంది.  గత ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా వ్యవహరించిన తెలుగు నేతలు అందిన కాడికి బూడిద మింగేశారు. అంతే కాకుండా మరో ఐదేళ్లకు సరిపడా సొంత గూటిలో దాచి ఇప్పుడు అధికారికంగా అమ్ముకుంటున్నారు.
 
 
కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు పూర్తి భిన్నంగా జరుగుతోంది. బూడిద రవాణాకు సంబందించి  ఎన్టీటీపీసీ  బూడిదను ఉచితంగా ఇస్తుంది. కానీ, సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వారి పెత్తనం పని చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో టిడిపి పెత్తనం చేయగా, ప్రస్తుతం వైసీపీ చేస్తుంది. కానీ బూడిద రవాణాలో కొమ్ములు తిరిగిన సామ్రాట్ లు బూడిదలో దిగబడిపోవడంతో ఒక దశలో అధికార పార్టీ నేతల పెత్తనం చెల్లడం లేదు అనేది తెలుస్తోంది. జాతీయ రహదారి పనులకు మెగా కంపెనీ ద్వారా బూడిద రవాణా జరుగుతుండగా, ఆ రవాణా మాత్రం ఎమ్మెల్యే వసంత అనుచరుడు నడిపిస్తున్నాడు. కానీ మిగతా ఉచిత బూడిద రవాణా మొత్తం పసుపు నేతల కనుసన్నల్లో జరుగుతుండటం గమనార్హం. అందులో భాగంగానే లోకల్ డ్రైవర్లకు బూడిద అందకుండా చేస్తూ, వారి ఉపాధికి గండి కొడుతున్నారు అనేది వైసీపీ నేతల వాదన.
 
 
బూడిద రవాణా చేస్తేనే మాకు పూట గడుస్తుంది సామి అని స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు మొర పెట్టుకున్నాడు ఒక డ్రైవర్. అయితే ఆ సమయంలో ఎమ్మెల్యే వసంతతో, ఎమ్మెల్యే అనుచరుడుతో మాటలు లేకపోవడంతో డ్రైవర్ అభ్యర్థన మేరకు బూడిద సామ్రాట్ అయిన ఒక టిడిపి సానుభూతి పరుడికి ఫోన్ చేసిన సదరు వైసీపీ నేత ఆ డ్రైవర్ కు లోడ్ ఇవ్వాలని సిఫార్స్ చేశారట. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను బాధ్యుడిని చేసి రాజకీయంగా లబ్ది పొందడం.. ఇలా ఒక్క ఈ  ఒక్క ఉదాహరణ చాలదా ఎవరు బూడిద ను ఏలతన్నారో... చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న బూడిద మాఫియా ఇప్పుడు అదే బూడిద లోకల్ డ్రైవర్లు కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ధర్నాలు చేయడం వింత గా మారింది.  ఇష్టారాజ్యాంగా బూడిద రవాణా చేసేదే వారు, ఇప్పుడు వారే లోకల్ కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ కలరింగి ఇచ్చేది వారే. అంతిమంగా ఎమ్మెల్యే దెబ్బకు రెండు కాదు నాలుగు ఐదు పిట్టలు కొట్టగల సమర్థులు తెలుగు నేతలు, వారి చాణక్యత తెలీక అమాయక లారీ డ్రైవర్ లు అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు అనే అపోహలో ఉన్నారు.
 
 
ఇప్పటి వరకు ఎమ్మెల్యే వసంత ను బాధ్యుడిని చేసిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి బూడిద గుమ్మడికాయల ను తప్పించి లోకల్ డ్రైవర్లు కు రవాణా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే అందరికీ సమ న్యాయం జరుగుతుంది అనేది స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో పడిన నిందలు నిజం చేసుకోవడం కోసం ఎమ్మెల్యే గమ్మున ఉంటారా? లేక బూడిద ర‌ణ‌రంగంలోకి నేరుగా దిగుతారా అనేది ఇపుడు చ‌ర్చనీయాంశం అయింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments