Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (08:06 IST)
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ఆరుగేట్లను మూసివేసి నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు 1,11,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎగువ జూరాల నుంచి 1,62,326 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 20,680 క్యూసెక్కులు కలిపి నీటి ప్రవాహం 1,83,006 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది.

అదే సమయానికి జలాశయం నీటిమట్టం 885 అడుగులకు గాను 884.40 అడుగులకు చేరుకుంది. 211.95 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

శ్రీశైలం నుంచి వరద ప్రవాహం తగ్గడంతో నాగార్జునసాగర్‌ 20 గేట్లు మూసివేసి నాలుగు గేట్ల ద్వారా 95,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి మంగళవారం ఉదయం 2.13 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగా సాయంత్రం 7 గంటలకు 1,79,006 క్యూసెక్కులు విడుదల చేశారు.

ప్రకాశం బ్యారేజీకి 3.2 లక్షలు ఇన్‌ఫ్లో ఉండగా 3.10 లక్షలు క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో కొనసాగుతోంది. మూడ్రోజులుగా ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద రావడంతో గుంటూరు జిల్లాలోని కొల్లూరు, కొల్లిపర, భటిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments