Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచలం మృతురాలి కుటుంబానికి రూ.9 లక్షల పరిహారం

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (12:35 IST)
విశాఖ జిల్లా సింహగిరి మెట్లమార్గంలో బండరాళ్లు దొర్లిపడి మహిళ మృతి చెందడంతో సింహాచలం దేవస్థానం అధికారులు నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నారు. సింహగిరి మెట్లమార్గంలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఆకాశధార దగ్గర నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకూ ప్రమాదకరంగా ఉన్న రాళ్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. మెట్లను ఆనుకుని ఉన్న రాళ్లను ముందుగా తొలగించనున్నారు. భవిష్యత్తులో పనుల జరిగేటప్పుడు రాళ్లు జారిపడకుండా ఇనుప‌ మెస్‌ ఏర్పాటుచేయాలని డిసైడయ్యారు.
 
ప్రస్తుతానికి భక్తులు మెట్లమార్గంలోకి రాకుండా సింహగిరిపైన, కొండ దిగువన తొలిపావంచా దగ్గర దారులను మూసివేశారు. సెక్యూరిటీ గార్డులను అక్కడ నియమించారు.
 
మెట్లమార్గంలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఆదిరెడ్డి భవానీ కుటుంబానికి దేవస్థానం తరపున రూ.5 లక్షలు, పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షలు, ఇంజినీరింగ్‌ అధికారులు రూ.లక్ష మొత్తం 9 లక్షలు తక్షణ సాయంగా అందిస్తామని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments