Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాట్సాఫ్ ఎస్పీ, అత్యాచారం బాధితురాలికి ఆర్థిక సహాయం

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (19:05 IST)
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి మరోసారి తన దయాగుణాన్ని చాటుకున్నారు. తన జీతంలో విద్యార్థులకు విద్య కోసం సగం డబ్బులను ఇస్తూ ఆపదలో ఎవరైనా ఉంటే వారికి ఆర్థిక సహాయం చేస్తుంటారు ఎస్పీ రమేష్ రెడ్డి.
 
కరోనా సమయంలో రైతుల పొలాల వద్దకు వెళ్ళిన ఎస్పీ వారు పడుతున్న బాధలు చూసి నిత్యావసర వస్తువులను అందజేశారు. వారిని ఆర్థికంగా అందుకున్నారు. ఇలా తనలోని దయాగుణాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటున్నారు ఎస్పీ.
 
సరిగ్గా రెండురోజుల క్రితం తిరుపతిలో ఒక ఫాస్టర్ చేతిలో యువతి అత్యాచారానికి గురైంది. అసలే నిరుపేద కుటుంబం కావడం.. బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదనతో ఎస్పీ దగ్గర గోడు వెల్లబోసుకుంది. దీంతో ఎస్పీ చలించిపోయారు. బాధితురాలికి తన వంతు సాయంగా 25 వేల రూపాయలను అందజేశారు. 
 
స్వయంగా తన జీతంలోని సగాన్ని 25వేల రూపాయలను చెక్కు రూపంలో బాధితురాలి తల్లికి అందించారు ఎస్పీ. ఎస్పీ సహాయాన్ని అభినందిస్తున్నాయి ప్రజా సంఘాలు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments