Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్ కేసులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ నటుడు అభిషేక్‌ అరెస్టు.. విదేశీయులు కూడా...

డ్రగ్ కేసులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, 'డేంజర్' వంటి చిత్రాల్లో నటించిన నటుడు అభిషేక్‌‌ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయనతో పాటు మరో ఇద్దరు విదేశీయులు సహా ఆరుగురు నిందితులను కూ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (08:41 IST)
డ్రగ్ కేసులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, 'డేంజర్' వంటి చిత్రాల్లో నటించిన నటుడు అభిషేక్‌‌ను హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయనతో పాటు మరో ఇద్దరు విదేశీయులు సహా ఆరుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కలిసి ఒక గ్రాము మత్తు పదార్థాన్ని 5 వేలకు విక్రయిస్తూ ఇదో గొలుసుకట్టు వ్యాపారంగా చేస్తూ వచ్చారు. వీరి వద్ద నుంచి 370 గ్రాముల మాదకద్రవ్యంతో పాటు.. రూ.46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
అభిషేక్‌, మరో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం ఆరుగురు.. కొన్నేళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సంపన్నులనే లక్ష్యంగా చేసుకొని గొలుసుకట్టు వ్యాపారంగా కొకైన్‌ విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఏకంగా 5 వేల మంది వరకు కస్టమర్లను ఏర్పాటు చేసుకొని జోరుగా వ్యాపారం చేస్తూ వచ్చారు. 
 
ఈ వ్యవహారాన్ని పసిగట్టిన పోలీసులు వీరిపై ప్రత్యేకంగా నిఘా సారించింది. దీంతో అభిషేక్‌‌ను, ఇతర ఆరుగురు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్‌, 12 సెల్‌ఫోన్లు, ఓ కారు, బైకు, రూ 46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments