Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగింది... కైపు తలకెక్కింది... బార్‌లో బుల్లితెర నటిపై దాడి

ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫి

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (08:26 IST)
ఐటీ నగరం బెంగుళూరులోని ఓ బార్‌లో జరిగిన వివాదంలో బుల్లితెర నటి చిక్కుకుంది. తప్పతాగడంతో నిషా తలకెక్కింది. దీంతో నానా హంగామా చేయడమే కాకుండా, తనకు పార్టీ ఇచ్చిన ఓ ప్రముఖుడి కుమారుడిపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మత్తు దిగడంతో అయ్యోబాబోయ్.. క్షమించండి అంటూ ప్రాధేయపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత ఆదివారం రాత్రి బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్తులోని స్కైబార్‌లో పలువురు యువతీయువకులు కలిసి పీకలవరకు మద్యం సేవించారు. ఆ తర్వాత వారంతా గొడవపడి పరస్పరం బూతులు తిట్టుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. మొత్తం ఏడుగురు స్నేహితుల ఈ బృందంలో బుల్లితెర నటి నిరూషా కూడా ఉన్నారు. 
 
దీంతో ఈ హంగామా శృతిమించిపోవడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు దర్శన ఒక దశలో హద్దుమీరి బుల్లితెర నటి నిరూషాపై దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామంలో ఖంగుతిన్న ఆమె స్నే హితులతో కలిసి నేరుగా కబ్బన్ పార్క్‌ పోలీస్‌ స్టేషనకు వెళ్లి ఫిర్యాదు చేసింది. 
 
ఈ లోపు నిషా దిగిన దర్శన తప్పయింది క్షమించమంటూ లేఖరాయడంతో కథ సుఖాంతమైంది. నిరూషా కూడా దర్శన్‌పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు సమ్మతించింది. అడపాదడపా స్కైబార్‌లో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments