Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ +3 లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం: పవన్ కల్యాణ్

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (19:51 IST)
జీ+3 గృహాల కేటాయింపు వ్యవహారంలో లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు జనసేన - భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా పోరాటం చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం ఇరు పార్టీలు నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.

మంగళవారం మధ్యాహ్నం జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలు, జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి నిరసన కార్యక్రమాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “లబ్దిదారులు తమ వాటా మొత్తం చెల్లించిన తర్వాత ప్రభుత్వాలు మారిపోవడంతో కేటాయింపులు జరపకుండా వదిలేస్తున్నారు. గృహ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మన రాష్ట్రంలోనూ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారు. నిర్మాణం చేపట్టారు. కొన్ని చోట్ల పూర్తయ్యాయి. ప్రభుత్వం మారాకా వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిలిపేశారు.

దీంతో ప్రజాధనం విపరీతంగా దుర్వినియోగం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాగే ఇళ్లు కట్టి వదిలేశారు. అవి ప్రస్తుతం శిధిలావస్థకు చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జీ+3 గృహాల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయి. రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు కట్టిన తర్వాత కూడా ఇళ్లు రాక లబ్దిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కర్నూలులో జీ +3 గృహ సముదాయాలు ప్రత్యక్షంగా చూశాను. బాధితులతో మాట్లాడినప్పుడు వారు తమకు న్యాయం చేయాలని కోరారు. కట్టిన ఇళ్ల వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. కట్టింది మా పార్టీ కాదు. మీరు వేరే పార్టీకి ఓటు వేశారు అనే మాటలు కాకుండా ఖచ్చితంగా అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరగాలి. 

ఈ సమస్యపై బీజేపీతో కలసి సమష్టిగా ముందుకు వెళ్దాం. కరోనా కారణంగా.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు అండగా ఉండాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపడదాం. రేపటి ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం” అన్నారు.
 
అర్హులందరికీ సమన్యాయం మన లక్ష్యం: నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల22వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జనసేన-బీజేపీ కలసి నిరసన చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 24 లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. అందుకు సంబంధించి రూ. 5 వేల కోట్ల నిధులు కూడా విడుదల చేసేశారు. లబ్దిదారులకు ఇళ్లు కేటాయించడంలో గత ప్రభుత్వం విఫలం కావడం, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే రీతిలో ముందుకు వెళ్లడంతో అర్హత కలిగిన లబ్దిదారులు  ఆ సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు.

పాలకుల తీరు వల్ల చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. ఇరు పార్టీలు సంయుక్తంగా ధర్నా ద్వారా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించడం జరిగింది. కేంద్రం నుంచి నిధులు మంజూరు అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం అనేక సాకులు చెప్పి ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇళ్లు అందచేయకుండా చివరి నిమిషంలో తప్పించుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడచినా వీరూ లబ్దిదారులకు ఆ వసతి అందించలేకపోయారు.

కర్నూలు పర్యటనలో పవన్ కల్యాణ్ తో కలసి స్వయంగా వెళ్లి ఇళ్లను పరిశీలించాం. గుంటూరులోనూ ఇదే పరిస్థితి. భూసేకరణ తర్వాత ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు 12 లక్షల ఇళ్లు కేటాయించామని చెబుతున్నారు. అందులో భారీగా అవినీతి జరిగింది. ఆ అవినీతిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సామాజిక దూరం పాటిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి” అన్నారు. 

టెలీ కాన్ఫరెన్స్ లో సంయుక్ల పార్లమెంట్ కమిటీల కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, సభ్యులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. సుందరపు విజయ్ కుమార్, టి.సి. వరుణ్, మేడా గురుదత్ ప్రసాద్, కళ్యాణం శివశ్రీనివాస్ (కె.కె.), షేక్ రియాజ్, గడసాల అప్పారావు, శెట్టిబత్తుల రాజబాబు, సయ్యద్ జిలానీ, పోతిన వెంకట మహేష్, వేగుళ్ల లీలాకృష్ణ, చింతా సురేష్, డా. మైఫోర్స్ మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్, ఆకుల ఉమేష్ తదితరులు జిల్లాల్లో జీ+3 లబ్దిదారులు పడుతున్న సమస్యలను వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments