Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లా దొనకొండలో ఫైబర్ గ్రిడ్... ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (21:15 IST)
విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా విశాఖ మెట్రో ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని సత్వరం ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సబంధించిన ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందంపై గతంలో జారీచేసిన ఉత్తర్వులకు ఆమోదం తెలపడంతోపాటు ఆర్ఎఫ్పీ, రాయితీ ఒప్పందాన్ని విడుదల చేయడానికి అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) మేనేజింగ్ డైరెక్టరుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో 42.55 కిలోమీటర్ల మేర 3 కారిడార్లుగా విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 
 
ఈ ప్రాజెక్టు తాజా అంచనా వ్యయం రూ.8300 కోట్లుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు నిమిత్తం బాహ్య వాణిజ్య రుణాలు లేదా ఏదైనా ఇతర విదేశీ ఫండ్ ఏజెన్సీలు/ఆర్థిక సంస్థల నుంచి భారతీయ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ రేట్లతో రూ. 4200.00 కోట్లు మించకుండా రాష్ట్ర ప్రభుత్వ వన్‌టైమ్ సావరిన్ గ్యారంటీతో అప్పుగా తీసుకోవడానికి ఏఎంఆర్సీని అనుమతిస్తారని చెప్పారు. ప్రారంభమైన తొలి 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధిదారుకు రూ.820 కోట్లకు మించకుండా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
 
రన్నింగ్ సెక్షన్, స్టేషన్లు, పార్కింగ్ ప్రాంతాలు, డిపో ఏర్పాటుకు 83 ఎకరాల ప్రభుత్వ భూమిని అందించడమే కాకుండా మరో 12 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా కలెక్టర్‌ అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించించినట్లు చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టులో ఎస్జీఎస్టీ కింద రీఇంబర్స్‌మెంట్ చేయాల్సిన మొత్తం రూ.527 కోట్లని తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సరఫరాను గ్రిడ్ నుంచి నిరంతరాయంగా అందిస్తారన్నారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తారని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ అవసరమైన భద్రత అంశాలను అందిస్తారన్నారు.
  
దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్
ప్రకాశం జిల్లా దొనకొండలో మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణానికి 2395.98 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకీ ఉచితంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దొనకొండ మండలం  రాగమక్కపల్లి, భూమనపల్లి, రుద్రసముద్రం, ఇండ్లచెరువు గ్రామాల పరిధిలోని ఈ భూమిని దొనకొండ మెగా ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణం కోసం  ప్రకాశం జిల్లా  ఏపీఐఐసీ జోనల్ మేనేజర్‌కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
 
దేశానికే గొప్ప నమూనాగా నిలిచిన ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును 2019 జూన్ నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. ఈ ప్రాజెక్టు అడ్ గ్రెడేషన్, అదనపు సీపీయూ బాక్సుల ఏర్పాటు నిమిత్తం అవసరమైన రూ.3,283 కోట్లను రుణ రూపంలో సమకూర్చుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీగా ఉండేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సోషియో ఎకనామిక్ గ్రోత్ సాధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న 5 గ్రిడ్లలో ఫైబర్ గ్రిడ్ ఒకటని తెలిపారు. 24 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్, కేబుల్ టీవీ ప్రసారాలు, టెలిఫోన్ సదుపాయాలు కల్పించాలన్నది ఈ గ్రిడ్ ఏర్పాటు లక్ష్యంగా పేర్కొన్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ స్టేట్ ఫైబర్ గ్రిడ్ లిమిటెడ్ పేరిట ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు.  
 
కార్పొరేషన్ ద్వారా 13 జిల్లాలలో హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం అని తెలిపారు. 24 వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యుత్ స్థంభాల ద్వారా ఆప్టికల్ కేబుల్ సమకూర్చడమే కాకుండా 2445 గుర్తించిన సబ్ స్టేషన్లలో పాయింట్స్ ఆప్ ప్రెజెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం నెట్‌వర్క్ కు విశాఖపట్నంలో స్టేట్ వైడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ప్రధాన కేంద్రంగా ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments