Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళతో ఎంజాయ్ చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిన ఏఆర్ కానిస్టేబుల్

Advertiesment
మహిళతో ఎంజాయ్ చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిన ఏఆర్ కానిస్టేబుల్
, బుధవారం, 7 నవంబరు 2018 (13:17 IST)
మహిళలకు రక్షణ కల్పిస్తూ, శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన ఓ కానిస్టేబుల్ ఏకంగా పరాయి స్త్రీతో ఆమె ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత అక్కడ నుంచి తప్పించుకునేందుకు తన సర్వీస్ రివాల్వర్‌తో మహిళ భర్తకు గురిపెట్టాడు. దీంతో భయపడిన అతను కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి కానిస్టేబుల్‌ను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. 
 
హైదరాబాద్ నగరంలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చేవెళ్ల మండలం సింగప్పగూడకు చెందిన చాకలి రమేష్‌ (28) అనే వ్యక్తి రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా నాలుగేళ్లుగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో అడిషనల్‌ డీసీపీ శిల్పవల్లి వద్ద గన్‌మాన్‌గా పనిచేస్తున్నాడు.
 
ఈయన సొంతూరు వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం నిజాంపేట్‌ మేడిపల్లి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళకు ఆరేళ్ళ క్రితం వివాహం జరిగింది. అయితే, బతుకుదెరువు కోసం భర్తతో కలిసి హిమాయత్‌నగర్‌కు వలస వచ్చింది. ఈ క్రమంలో రమేష్‌కు, ఈ మహిళకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఒకేసారి మేడిపల్లికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ వచ్చారు. అయితే, ప్రతిసారీ వెళ్లడం కుదరకపోవడంతో హిమాయత్ నగరంలోని ఆ మహిళ ఇంటికే రమేష్ నేరుగా వెళ్లి వచ్చేవాడు. 
 
అలాగే, సోమవారం సాయంత్రం రమేష్‌ ఆమె ఇంటికి వచ్చాడు. పనికి వెళ్లిన మహిళ భర్త రాజు రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి రమేష్‌ అడ్డంగా దొరికిపోయాడు. తన భార్యతో అసభ్యకర భంగిమలో ఉండటాన్ని చూసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే, అతని నుంచి తప్పించుకునేందుకు సర్వీస్‌ రివాల్వర్‌తో చంపేస్తానని రమేష్‌ బెదిరించాడు. దీంతో మహిళ భర్త అరవడంతో స్థానికులు వచ్చి రమేష్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం చేరవేసి, వారికి అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షియోమీ 4కె అల్ట్రా హెచ్.డి టీవీ.... 16జీబీ స్టోరేజ్