Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నన్నా... అన్నగారి పార్టీని మీరు నడిపిస్తే బాగుంటుందన్నా.. ఎవరు?

Webdunia
గురువారం, 18 జులై 2019 (18:45 IST)
సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో టిడిపి అధినేత నారా చంద్రనాయుడు ఓటమి వరకు వెళ్ళి చివరకు గెలుపొందారు. కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే టిడిపి కైవసం చేసుకుంది. మొదట్లో ఇవిఎంల కారణంగా తాము ఘోరంగా ఓడిపోయామని చెప్పే ప్రయత్నం చేశారు టిడిపి నేతలు. 
 
అయితే కొంతమంది టిడిపి నేతలు మాత్రం ఇదంతా చంద్రబాబునాయుడు మీద ఉన్న వ్యతిరేకత అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు, నారా లోకేష్‌ కన్నా ఇప్పుడు వేరే నాయకుడు అవసరమని టిడిపి నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
 
దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ కాబట్టి ఆ కుటుంబానికే పార్టీని అప్పజెప్పాలన్న నేతలూ లేకపోలేదు. అయితే ఇలా చర్చ జరుగుతుండగానే కొంతమంది నేతలు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు సిద్థమవుతున్నారట. 
 
సినిమాల్లో చేస్తూనే టిడిపి పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి జూనియ్ ఎన్టీఆర్ ఒక్కరే సరైన నాయకుడన్న ఆలోచనలో ఉన్నారట టిడిపి నేతలు. అయితే నేతలు కలిసినప్పుడు వారికి నచ్చజెప్పి పంపించేద్దామన్న ఆలోచనలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారట. మరి చూడాలి... జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసే టిడిపి నేతలపై చంద్రబాబు ఏవిధంగా వ్యవహరిస్తారన్నది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments