Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్లిందనీ కన్నబిడ్డలను కడతేర్చాడు..

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (13:22 IST)
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించసాగాడు. ఈ వేధింపులను తాళలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త... తన ఇద్దరు కన్నబిడ్డలను హత్య చేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాకు రామచంద్రాపురంకు చెందిన కుమార్ అనే వ్యక్తి మేస్త్రీగా, శిరీష కూలీగా పనిచేస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మల్లీశ్వరి(10), అఖిల్(6), శరణ్య(4) సంతానం. భార్యపై అనుమానం పెంచుకున్న కుమార్ వేధించసాగాడు. 
 
మద్యం తాగొచ్చి భార్య, పిల్లలను కొట్టడంతోపాటు ఈ పిల్లలు తనకు పుట్టలేదనేవాడు. వేధింపులు భరించలేక నెలక్రితం శిరీష పటాన్‌చెరు మండలం చిన్నకంజర్లలోని పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో పిల్లలను కుమార్ బలవంతంగా తీసుకుని ఇంటికొచ్చాడు. మంగళవారం రాత్రి శిరీష తల్లికి ఫోన్‌చేసి గొడవపడ్డాడు. ఎవరికో పుట్టిన పిల్లలను నావద్ద విడిచిపెట్టి పోయింది. నీ కూతురిని, పిల్లలను ఏదో ఒకరోజు చంపుతానని బెదిరించాడు. 
 
అదేరోజు రాత్రి మద్యం తాగొచ్చి అప్పటికే నిద్రిస్తున్న పిల్లల్లో శరణ్య(4)ను మెడచుట్టూ తాడు బిగించి హత్యచేశాడు. తర్వాత కత్తితో కొడుకు అఖిల్(6) గొంతు కోశాడు. పెద్ద కూతురు మల్లీశ్వరిని కత్తితో పొడువబోతుండగా తేరుకుని బయటకు పరుగులు తీసింది. ఇంటి పక్కన వాళ్లకు విషయం చెప్పడంతో వాళ్లు వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments