Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 19 మే 2020 (05:58 IST)
రైతు సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  సోమవారం రాయచోటి పట్టణంలో వేరుశనగ విత్తన పంపిణీ ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలోను రైతులకు ఇబ్బందులు కలగకుండా   వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు.

నియోజక వర్గానికి18290.4 క్వింటాళ్ల  వేరుశనగ విత్తనాలును ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు.40 శాతం సబ్సిడీతో విత్తనాలు అందుతాయన్నారు.30 కేజీ ల బస్తా  ధర  రూ.1413 రూపాయలన్నారు. గ్రామ సచివాలయల వద్దనే విత్తనాల పంపిణీ జరుగుతుందన్నారు. గతంలో మాదిరి విత్తనాల కోసం నిరీక్షణ, కష్టాలు ఇక వుండవన్నారు. 

వేరుశనగ  పంట వేయాలనుకున్న ప్రతి రైతుకు విత్తనాలు అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పంపిణీ ని పారదర్శకంగా  చేపట్టాలన్నారు. ప్రభుత్వం  వేరుశనగ కు మద్దతు ధర రూ.61 ప్రకటించి నియోజక వర్గ వ్యాప్తంగా 6730.15 క్వింటాళ్ల వేరుశనగ ను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.

వర్షాలు సంవృద్దిగా కురిసి రైతన్నలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విత్తన పంపిణీ లో ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కరోనా నేపథ్యంలో  భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రతలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషా, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీ కృష్ణ, ఏ పి సీడ్స్ జిల్లా మేనేజర్ శివజ్యోతి, రాయచోటి వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు సావిత్రి, వ్యవసాయ శాఖాధికారి దివాకర్,జెడ్ పి టి సి అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి,

మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి,సింగిల్ విండో అధ్యక్షుడు బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఆసీఫ్ అలీఖాన్, వైఎస్ఆర్ సి పి నాయకులు పల్లపు రమేష్, మదన మోహన్ రెడ్డి, అలీ నవాజ్, హాబీబుల్లా ఖాన్ , కొలిమి హారూన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments