Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష

Advertiesment
Farmer
, బుధవారం, 13 మే 2020 (20:28 IST)
రైతుల పక్షపాతిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ బి. అంజాద్ బాషా పేర్కొన్నారు. పాత కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి రైతులకు జీలుగలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ 50 శాతం సబ్సిడీతో జీలుగలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా తనతండ్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తున్నారన్నారు. విత్తనాల పంపిణీ కార్యక్రమం గతంలో మండల స్థాయిలో చేసేవారని నేడు గ్రామస్థాయిలో గ్రామ సచివాలయల ద్వారా రైతులకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ నెల 18వ తేదీ నుంచి 40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తారన్నారు. రైతులు గ్రామ సచివాలయంలో డబ్బులు చెల్లించి రాయితీ పొందవచ్చనన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగ లేనప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వారికి కావలసిన విత్తనాలన్నీ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందన్నారు.

మే 15వ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు  రైతుల ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మార్కెట్ యార్డ్ లలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని దీంతో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జె.డి మురళి కృష్ణ, ఎ డి ఎ నరసింహారెడ్డి, ఏ ఈ ఓ రమేష్, పావని, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం