Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లస్టర్ల విభజనకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు

Advertiesment
AP Government
, సోమవారం, 4 మే 2020 (20:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్ల విభజనకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండీ ఇంతియాజ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం క్లస్టర్లను గుర్తించిందన్నారు. గడిచిన 5 రోజుల్లో కేసులు రికార్డయితే అది వెరీ యాక్టివ్‌ క్లస్టర్‌గాను, గడిచిన 6 నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైనా( 5 రోజుల్లోగా కేసులు లేకపోతే) వాటిని  యాక్టివ్‌ క్లస్టర్‌ గాను  గడిచిన 15 నుంచి 28 రోజుల్లో కేసులు నమోదైనా ( 15 రోజుల్లోగా కేసులు నమోదు కాకపోతే ) వాటిని  డార్మంట్‌ క్లస్టర్‌ గాను, 28 రోజులుగా కేసులు నమోదు కాకపోతే గ్రీన్ జోన్ గాను గుర్తిస్తా మన్నారు.

 
ఒక గ్రీన్ జోన్ నుంచి మరో గ్రీన్ జోన్ కి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రీన్ నుంచి రెడ్ జోన్ కి , రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి అనుమతులు ఇవ్వడం జరగదన్నారు.
 
కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పాజిటివ్‌ కేసు ఉన్న ఇంటి నుంచి ప్రారంభమై 500 మీటర్ల నుంచి 1 కి.మీ వరకూ 3 కిలోమీటర్ల వరకూ బఫర్‌ జోన్‌  (కేసు ఉన్న ఇంటి నుంచి దూరంతో కలుపుకుని)  కేసుల సంఖ్య, కాంటాక్ట్స్, తీవ్రతను బట్టి జిల్లా అధికారులు పరిధిని నిర్ణయిస్తామన్నారు.
 
అర్బన్‌ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ కాలనీలు, మున్సిపల్‌ వార్డులు వారీగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు,  కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌కు సమీపంలో ఉన్న వార్డులు, కాలనీల్లో సర్వేలెన్స్‌ కొనసాగుతుందన్,  రూరల్‌ ప్రాంతాల్లో పంచాయతీల ప్రాతిపదికన కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ కేసులు, కాంటాక్టులను బట్టి అధికారులు దీనిచుట్టూ పరిధిని పెంచే అవకాశం ఉంటుంది.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో బారికేడ్లతో రోడ్ల మూసివేతతో పాటు అన్నిరకాల కదలికలు నిషేధం. నిత్యావసరాలకు ఇంటికి ఒకరిని మాత్రమే అనుమతిస్తారన్నారు.. వీలైనంత వరకూ ఇంటివద్దకే నిత్యావసరాల పంపిణీ చేస్తామని, 
కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల వద్దకే మొబైల్‌ వాహనాలతో నిత్యావసరాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.

వ్యక్తుల కదలికలన్నీ రికార్డు చేస్తామని, ప్రతి కుటుంబం ఆరోగ్యపరిస్థితులపై సంపూర్ణంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. కేసులు వారి కాంటాక్టుల వివరాలను 12, 24 గంటలకోసారి అప్‌డేట్‌ చేస్తారని, వైరస్‌ సోకినవారికి ఉన్న లక్షణాలను బట్టి క్వారంటైన్‌కు తరలిస్తారన్నారు.

హై రిస్క్‌ ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రోటోకాల్‌. మంచి వైద్యం కోసం తరలిస్తారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లో ఉన్నవారంతా ఆరోగ్య సేతులో 100 శాతం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిందేనన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

7 నుంచి విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు