Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.2.40 లక్షలు స్వాహా

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (11:01 IST)
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ ఖాతాలు సృష్టిస్తూ లక్షల్లో కొట్టేస్తున్నారు. తాజాగా ఏకంగా కలెక్టర్ పేరుపైనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన ఓ సైబర్ నేరగాడు.. రూ. 2.40లక్షలు నగదు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట కలెక్టర్ హరిచందన పేరు, ఆమె ఫొటోతో సైబర్ నేరగాడు నకిలీ వాట్సప్ ఖాతాను సృష్టించాడు. 
 
ఈ వాట్సప్ ఖాతా నుండి పలువురి అధికారులకు, ప్రముఖులకు.. తాను సమావేశంలో ఉన్నానని, ఒక వస్తువు వెంటనే కొనుగోలు చేసేందుకు నగదు కావాలంటూ మెస్సేజ్ చేశాడు. 
 
ఈ మెస్సేజ్ చూసిన జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మూడు విడతలుగా రూ. 2.40 లక్షలు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాట్సాప్‌లో మెస్సేజ్ ఇచ్చింది కలెక్టర్ కాదని, సైబర్ నేరగాడు అని పోలీసులు తేల్చారు. సదరు వ్యక్తి ఝార్ఖండ్ కు చెందిన వాడని గుర్తించామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments