Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (10:35 IST)
ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి జగన్ సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ పంచెకట్టులో ఆలయ ప్రవేశం చేశారు. 
 
స్వామివారిని దర్శించుకున్న సీఎం జగన్, కల్యాణ వేదిక వద్దకు తరలివెళ్లనున్నారు. తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహిస్తున్నారు.
 
తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా రామూలోరి కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ కు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. 
 
ఇక రెండు రాష్ట్రాలు విడిపోక ముందు శ్రీరామనవమి ఉత్సవాలు భద్రాచలంలో ఎంతో ఘనంగా జరిగేవి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం జరిపిస్తారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణం శ్రీరామ నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజు జరిపిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments