Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుపై కోర్టు ధిక్కరణ : పిటిషన్ పైల్ చేసిన నిమ్మగడ్డ

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఎస్ఈసీ నియామకం విషయంలో గతంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పాటించలేదనీ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటూ వచ్చారు. అయితే, కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. 
 
దీంతో ఆగ్రహించిన సీఎం జగన్.. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆయన పదవీకాలాన్ని కుదించారు. దీంతో ఆయన మాజీ అయిపోయారు. అయన స్థానంలో కొత్త వ్యక్తిని రాష్ట్ర ఎస్ఈసీగా నియమించారు. 
 
దీనిపై నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డను తొలగిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు ఛాలెంజ్ చేయగా, అక్కడా ఎదురుదెబ్బే తగిలింది. 
 
ఆ తర్వాత కూడా ఏపీ సర్కారు రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డను నియమించలేదు. దీంతో ఏపీ సర్కారుపై కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని రమేశ్ కుమార్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. 
 
కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని పిటిషన్‌ దాఖలు చేసిన ఆయన.. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని చేర్చారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments