Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయింది : ఉండవల్లి

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (17:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమ పిచ్చుకేనని, కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వాల్తేరు వీరయ్య ద్వి శతదినోత్సవ వేడుకల్లో ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి కొన్ని సూచనలు చేశారు. వీటిని స్వీకరించాల్సిన అధికార వైకాపా మంత్రు చిరంజీవిపై నోరు పారేసుకుంటున్నారు. ఆయన క్యారెక్టర్ను కించపరుస్తున్నారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 
 
సినిమా పరిశ్రమ పిచ్చుకేనని, కానీ చిరంజీవి మాత్రం కాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి పార్లమెంట్లో గట్టిగా మాట్లాడటం వల్లే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వచ్చిందన్నారు. స్వయంగా మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం సాధారణ విషయం కాదన్నారు. అలాంటి చిరంజీవి ప్రత్యేక హోదా కోసం ఏపీ మంత్రులు పోరాటం చేయాలని సలహా ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదన్నారు.
 
ఏపీ కంటే తెలంగాణ ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, ఇది సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే సాధ్యమైందన్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో కంటే వైసీపీ హయాంలోనే 18 శాతం అదనంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని, ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాదని మరోసారి రుజువైందన్నారు. ఇది పూర్తి కావాలంటే టీడీపీ, వైసీపీ కాకుండా మరో ప్రభుత్వం రావాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments