Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానదే మా స్థలాన్ని ఆక్రమించింది : మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు

Webdunia
బుధవారం, 3 జులై 2019 (10:43 IST)
కృష్ణానది కరకట్టపై ఉన్న ఆక్రమణలపై మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు విచిత్రంగా స్పందించారు. కరకట్టపై ఉన్న తన అతిథి గృహానికి సీఆర్డీఏ అధికారులు నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, గత 25 ఏళ్ళ క్రితమే నేను ఉండవల్లిలో 25 ఎకరాల్లో ఉంటున్నా. తనకు ఉడా, ఇరిగేషన్ అనుమతి ఉందన్నారు. 
 
బీపీఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశామన్నారు. కానీ, మాకు అనుమతి రాలేదన్నారు. గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు మాత్రమే వదిలి కట్టడం చేపట్టుకోమని మాకు పర్మిషన్ ఇచ్చారు. నదిలో కూడా‌ మాకు ఇంకా ల్యాండ్ ఉంది. వరద వచ్చినప్పుడల్లా మా ల్యాండ్ కొంత కోల్పోయాం. మేం కట్టిన తర్వాత 100 మీటర్ల లోపల కట్టకూడదని జీవో వచ్చింది.

మేం ఎక్కడా రూల్స్ ఉల్లంఘించలా కరకట్ట‌ను మేం ఆక్రమించుకోలేదనీ, కృష్ణానదే తమ భూమిని ఆక్రమించుకుందని చెప్పారు. చట్ట ప్రకారమే తాను నడుచుకుంటున్నట్టు చెప్పారు. ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చిన విధంగా అన్నీ కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంబడి ఉన్నటువంటివి ఎన్నో కూల్చాలి నేను కట్టింది విలాసవంతమైనది కాదు.

కేవలం ఫాంహౌస్ మాత్రమే చిన్న చిన్న పొరబాట్లు అందరూ చేస్తారు. అందరి మీదా చర్యలు తీసుకుంటే మాపైన తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మాకు సీఆర్డీఏ అధికారులు నోటీసులిచ్చారు. వారం రోజుల్లో మా సమాధానం చెప్తా అని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments