Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మాజీమంత్రి పొన్నాల బంధువు మృతి

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:51 IST)
తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు కోడూరి ధృపత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. 
 
వివరాల్లోకి వెళ్తే 22 ఏళ్ల కోడూరి ధృపత్ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. 
 
దీంతో డివైడర్ తలకు బలంగా ఢీ కొట్టడంతో ధృపత్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధృపత్ ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 
 
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments