Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుద్ధంలో అలసిపోయాను.. దైవుడికి దూరమయ్యాను... సినిమాలకు గుడ్‌బై

యుద్ధంలో అలసిపోయాను.. దైవుడికి దూరమయ్యాను... సినిమాలకు గుడ్‌బై
, ఆదివారం, 30 జూన్ 2019 (17:24 IST)
భారత రెజ్లింగ్ క్రీడాకారిణి గీతా ఫోగాట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "దంగల్". ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించారు. ఇందులో చిన్ననాటి గీతగా జైరా వాసీం నటించింది. చిన్ననాటి గీతా పాత్రకు ఆమె ప్రాణం పోశారు. దీంతో ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఈ క్రమంలో జైరా సినిమా రంగం నుంచి వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేసింది. 'దంగల్' చిత్రం తర్వాత తీవ్ర మనోవ్యధకు గురైనట్టు పేర్కొంది. ఈ మేరకు జైరా వసీం ఓ ప్రకటన చేశారు. 
 
'నేను బాలీవుడ్‌లో దాదపు ఐదైళ్లు నుంచీ కొనసాగుతున్నాను. ఈ వృత్తి నాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఎందరో ప్రేక్షకుల ఆదరణ సంపాదించి పెట్టింది. అదే సమయంతో.. నాలో ఏదో అశాంతి చెలరేగింది. ఇందులో లభించిన గుర్తింపుతో నాకు ఆనందం కలగలేదు. నాకు ఏదో కల్పోతున్నట్టు అనిపించింది. ఈ సినీజీవితం.. నన్ను నా నమ్మకాలకు, విశ్వాసాలకూ(ఇమామ్) దూరం చేసింది. నేను ఇక్కడ సులువుగానే ఇమిడిపోవచ్చుగానీ, ఇది నా స్వభావానికి తగినది కాదనిపించింది. వృత్తి జీవితానికి.. మత విశ్వాసాలకూ మధ్య నిరంతర ఘర్షణ చోటుచేసుకుంది. దేవుడికి దూరమైపోసాగాను. ఈ యుధ్దంలో నేను అలసిపోయాను. 
 
సరైన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని నన్ను నేను సముదాయించుకుంటూ.. మరింత ఇబ్బందుల్లోకి పడిపోయాను. నేను ఎవరికైనా చెప్పదలుచుకున్నది ఒక్కటే.. డబ్బు, అధికారం, పాపులారిటీ వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చి.. దేవుడికీ నిజమైన ప్రశాంతతకూ దూరం కాకూడదు' అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. 
 
కాగా, దంగల్ చిత్రంలో ఆమె నటనకు గాను దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. బాలీవుడ్‌లో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు తన కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసింది. తానింక బాలీవుడ్‌లో యాక్టింగ్ చేయనని.. వృత్తి జీవితం తన మతవిశ్వాసాలకు అడ్డుపడుతోందని ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. మరోవైపు, జైరా నటించిన 'ది స్కై ఇజ్ పింక్' అనే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో జైరాతో పాటు, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కూడా నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్వీ రంగారావు పేరుతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్