సన్నీ లియోన్ అంటే తెలియని వారు బహుశా వుండరు. ఎందుకంటే ఆమె ఎలాంటి చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి పరిశ్రమకు వచ్చిందో చాలామందికి తెలుసు. ఇప్పుడామె వరుస ఆఫర్లతో బిజీగా వుంది. ఐతే గురువారం రాత్రి ఓ చిత్రాన్ని షూట్ చేస్తుండగా ఆమె తనలో వున్న ఓ కోణాన్ని ఒకటి బయటపెట్టడంతో యూనిట్ సభ్యులంతా అదిరిచచ్చారు.
అసలు విషయానికి వస్తే... ఓ చిత్రం షూటింగ్‌లో భాగంగా సన్నీ లియోన్‌ని హీరో తుపాకీతో పేల్చాలి. అలా పేల్చగానే సన్నీ గుండె వద్ద పట్టుకుని పడిపోవాలి. హీరో గన్ పేల్చాడు, సన్నీ పడిపోయింది. కానీ ఇక లేవలేదు. దాంతో అంతా బెంబేలెత్తిపోయారు. ఆమెను లేపేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె లేవలేదు. దీనితో ఆమెను లేపెందుకు దర్శకుడితో పాటు మిగిలినవారంతా గుమిగూడారు.
అప్పుడు ఒక్కసారిగా కళ్లు తెరిచి ఆమె పకాపకా నవ్వడం మొదలుపెట్టింది. సన్నీ లియోన్ చేసింది ఫ్రాంక్ అని తెలిసి అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సన్నివేశం తాలూకు వీడియోను సన్నీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.. మీరో ఓ లుక్కేయండి...