Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ఎమ్మెల్యే‌ కొడుకుపై మహిళ ఫిర్యాదు... పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేశాడు

డప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్ర ఓబుల్‌రెడ్డి అలియాస్‌ నానిపై ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్టు నమ్మించి తనను పెళ్లి చేసుకుని... కొద్ది ర

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (12:13 IST)
కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్ర ఓబుల్‌రెడ్డి అలియాస్‌ నానిపై ఓ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్టు నమ్మించి తనను పెళ్లి చేసుకుని... కొద్ది రోజుల పాటు కాపురం జరిపి వదిలివేశాడని పుత్తా వాసంతిరెడ్డి అనే మహిళ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నానితోనే జీవిస్తానని ఆ మేరకు తనకు న్యాయం చేయాలని పోలీసులను అభ్యర్థించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... కమలాపురం మండలం సంబటూరుకు చెందిన వాసంతిరెడ్డి ఎంటెక్‌ వరకు చదువుకున్నానని, 2013 నుంచి 2015 వరకు కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశానన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తుండగా చంద్ర ఓబుల్‌రెడ్డి తన వెంట తిరుగుతూ పరిచయం పెంచుకున్నాడన్నారు. తనకు మాయమాటలు చెప్పి 2015 ఏప్రిల్‌లో తిరుత్తణిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
అయితే ఆ సమయంలో మేమిద్దరం ఉండడంతో అదే ఏడాది నవంబర్‌ 2న కొంతమంది పెద్దల సమక్షంలో తిరుపతిలో మళ్లీ వివాహం చేసుకున్నట్టు తెలిపింది. వివాహమైన కొన్ని రోజుల వరకు తనతో అన్యోన్యంగా జీవించి తరువాత మా తల్లిదండ్రులు వద్దంటున్నారంటూ తనను వదిలేసి వెళ్లిపోయాడన్నారు. 
 
గత పది నెలలుగా తనతో జీవించేందుకు పెద్దమనుషులతో చెప్పి పంపుతున్నప్పటికీ తన భర్త నుంచి ఎలాంటి సమాచారంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. కాగా, ఈ మహిళ చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే శివానందరెడ్డి కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments