మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పితృ వియోగం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:03 IST)
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు దేవినేని ఉమామహేశ్వర రావు తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కొద్ది సేపటి క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచ‌ర్ల‌. ఆయ‌న పెద్ద కుమారుడు, మాజీ మంత్రి దేవినేని ర‌మ‌ణ గ‌తంలో రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. 
 
 
దేవినేని శ్రీమన్నారాయణ మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కంచికచర్లకు వ‌స్తున్న‌ట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం చంద్రబాబు ఉడండవల్లి లోని ఆయన నివాసం నుండి నేరుగా కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డులో దేవినేని ఉమ ఇంటికి వస్తారన్నారు.


అనారోగ్యంతో మృతి చెందిన దేవినేని శ్రీమన్నారాయణ మృతదేహాన్ని చంద్ర‌బాబు సందర్శించి నివాళులు అర్పిస్తారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. చంద్రబాబు వెంట, మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలు కూడా వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments