విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో గిరిజలను పడుతున్న కష్టాల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన బాలికలకు జరుగుతున్న వైద్యం చూసి తను చాలా బాధ పడుతున్నట్లు వెల్లడించారు.
ఇలాంటి పాలనలో ఎమ్మెల్యేగా వున్నందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో గిరిజనలు బాధలు చెప్పుకునేందుకు ఇక్కడ ఎవరూ లేరనీ, పట్టించుకునే మంత్రి లేరని అంటూ చెప్పారు. ఐతే ఈ వీడియో ఆమె తాజాగా మాట్లాడిందా లేదంటే గతంలో తెదేపా హయాంలో మాట్లాడినదా అనే అనుమానం కలుగుతోంది. మరి నిజం ఏంటో తెలియాల్సి వుంది.