గుంటూరు జిల్లాలో మాజీ సైనికుడి బీభత్సం - ఇద్దరి మృతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:37 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ మాజీ సైనికుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో జిల్లాలోని మాచర్ల ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మాచర్ల మండలం రాయవరంలో మట్టా సాంబశివరావు అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పని చేసిన మాజీ సైనికుడు. ఈయన తుపాకీతో బీభత్సం సృష్టించాడు. 
 
ఓ పొలం వివాదంలో సాంబశివ రావుకు, శివ, బాలకృష్ణ తదితరులతో వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ ముదరడంతో సాంబశివరావు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరపగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో శివ, బాలకృష్ణ సంఘటన స్థలంలోనే కుప్పకూలారు. 
 
వీరిద్దరూ రైతులు. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ సైనికుడు సాంబశివరావును అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments