Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరులో నలుగురు మైనర్లు మిస్సింగ్, అర్థరాత్రి నుంచి వెతుకుతున్న పోలీసులు

గుంటూరులో నలుగురు మైనర్లు మిస్సింగ్, అర్థరాత్రి నుంచి వెతుకుతున్న పోలీసులు
, శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:39 IST)
లాక్ డౌన్ దెబ్బకు ఇంట్లోనే మగ్గిపోతున్న పిల్లలు బయట కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆటపాటలతో చలాకీగా గడుపుతున్నారు. ఐతే ఇలా ఆడుకుని వస్తామని బయటకు వెళ్లిన నలుగురు టీనేజ్ పిల్లలు కనిపించకుండా పోయారు. ఒకేసారి నలుగురు కనిపించకపోవడంతో ఆందోళన చెలరేగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. గుంటూరు సిటీలో వున్న నెహ్రూ నగర్‌లో గురువారం సాయంత్రం నలుగురు టీనేజ్ పిల్లలు ఆడుకుని వస్తామని చెప్పి వెళ్లారు. వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు. బాలికల వయసు 14, 15 కాగా అబ్బాయిల వయసు 13, 17. వీరిలో ముగ్గురు పిల్లది ఒకే కుటుంబం.
 
ఐతే ఆడుకుని వస్తారులే అని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంటికి రాకపోయేసరికి వాళ్లు వెళ్లిన దగ్గర వెతికి చూసారు. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సమీపంలోని వారి వద్ద వాకబు చేసినా ఆచూకి లభించకపోవడంతో వెంటనే గుంటూరు కొత్తపేట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న అర్థరాత్రి నుంచి గుంటూరులో ప్రధాన ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. కానీ ఇంతవరకూ వారి ఆచూకి లభించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ డ్రగ్స్ కేసు .. మంత్రి కేటీఆర్ దగ్గరి వారికి ఈడీ నోటీసులు : రేవంత్ రెడ్డి