Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 1న వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దం

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (20:42 IST)
వైయస్‌ఆర్‌ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెల పెన్షన్ మొత్తాలను ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

గురువారం (ఏప్రిల్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1472.96 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశామని, సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే  పెన్షన్ మొత్తాలను అందచేస్తాని అన్నారు. 

ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్దంగా వున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్బంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, అలాగే ఆర్‌బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ ను కూడా పరిగణలోకి తీసుకుంటామని, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

పెన్షన్ మొత్తాలను మూడు రోజుల్లో నూరుశాతం పంపిణీ పూర్తి అయ్యేలా వలంటీర్లను ఆదేశించామని అన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల డిఆర్‌డిఎ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments