గవర్నర్‌గా నరసింహన్ సరికొత్త రికార్డు.. ఏంటది?

Webdunia
బుధవారం, 29 మే 2019 (13:27 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. గత 2009 నుంచి గవర్నర్‌గా ఉన్న ఈయన హయాంలో ఇప్పటికే నాలుగు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 30వ తేదీన ఐదో ప్రభుత్వం ఏర్పాటుకానుంది. 
 
గత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యారు. ఆ తర్వాత 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ పిమ్మట 2014లో నవ్యాంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో ప్రమాణం చేయించారు. 
 
అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 2018 డిసెంబరు నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికా కేసీఆర్ రెండోసారి ప్రమాణం చేయించారు. ఈయనతోనూ నరసింహన్ ప్రమాణం చేయించారు. 
 
ఇపుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జగన్‌తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వైకాపా ప్రభుత్వంతో కలిపి మొత్తం ఐదు ప్రభుత్వాలు గవర్నర్ హయాంలో ఏర్పడినట్టుగా చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments