Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిస్ గేల్ అరుదైన రికార్డు.. 12 సిక్స్‌లతో శతకం..

క్రిస్ గేల్ అరుదైన రికార్డు..  12 సిక్స్‌లతో శతకం..
, గురువారం, 21 ఫిబ్రవరి 2019 (10:52 IST)
వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఏకంగా 12 సిక్స్‌లు కొట్టి 135 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్‌తో అతను ఇప్పటి వరకు చేసిన సిక్సర్‌ల సంఖ్య 488కు చేరుకుంది. 
 
ఇప్పటి వరకు అత్యధిక సిక్సర్‌లు కొట్టిన రికార్డ్ పాకిస్థాన్ ఆల్ రౌండర్ అఫ్రిది పేరుపై ఉంది. అఫ్రిది 524 మ్యాచుల్లో 476 సిక్స్‌లు కొద్ది మొదటి స్థానంలో ఉండగా తాజా మ్యాచ్‌లో గేల్ దాన్ని అధిగమించాడు. అయితే గేల్ కేవలం 444 మ్యాచుల్లోనే 488 సిక్స్‌లు కొట్టడం గమనార్హం. అయితే గేల్, అఫ్రిది తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మెక్ కల్లమ్ (398), శ్రీలంక మాజీ ఆటగాడు జయసూర్య (352), భారత్ ఆటగాడు రోహిత్ శర్మ (349), మహేంద్ర సింగ్ ధోనీ (348) ఉన్నారు.
 
బుధవారం జరిగిన మ్యాచ్‌లో గేల్ కొట్టిన 12 సిక్స్‌లలో 4 సార్లు బంతి మైదానం బయట పడటంతో నాలుగు సార్లు కొత్త బంతిని మార్చాల్సి వచ్చింది. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసి తన వన్డే కెరీర్‌లో 24వ శతకం నమోదు చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్గిల్ జరిగినప్పుడే ఆడలేదా.. పుల్వామా జరిగినా ఆట ఆటే...