Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన రోజే చివరి రోజు... అమెరికాలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు ఇంజనీర్ ఒకరు దుర్మరణం పాలయ్యాడు. అదీకూడా తను పుట్టిన రోజే చనిపోవడం గమనార్హం. మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకుని తిరుగు ప్రయాణమైన ఆ ఇంజనీర్... రోడ్డు

Webdunia
సోమవారం, 3 జులై 2017 (13:40 IST)
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు ఇంజనీర్ ఒకరు దుర్మరణం పాలయ్యాడు. అదీకూడా తను పుట్టిన రోజే చనిపోవడం గమనార్హం. మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకుని తిరుగు ప్రయాణమైన ఆ ఇంజనీర్... రోడ్డు ప్రమాదం కబళించింది. ఈ విషాదకర ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆదివారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బాహార్‌పేటకు చెందిన పి.మురళి - వనజ దంపతుల ఏకైక కుమారుడు ప్రదీప్‌ (30) అమెరికా, నార్త్‌ కరోలీనాలోని డెల్‌ కంపెనీలో ఎనిమిదేళ్ల ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన కీర్తనతో 16 డిసెంబర్‌ 2015న ప్రదీప్‌ వివాహమైంది. ఆదివారం తన 30వ పుట్టిన రోజును ఉత్సాహంగా జరుపుకునేందుకు భార్య కీర్తన, మరో 8 మంది స్నేహితులతో కలిసి వెస్ట్‌ వర్జీనియాలోని సుటూన్‌ లేక్‌ వెళ్లాడు. 
 
అక్కడ వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా, కాల్నిఫోరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రదీప్‌ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య కీర్తన తీవ్రంగా గాయపడ్డారు. అదే వాహనంలో ఉన్న రవి, ప్రణీతదేవ జంటతో పాటు, మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆదివారం రాత్రి కీర్తన భువనగిరిలోని ప్రదీప్‌ తండ్రి మురళికి ఫోన్‌ చేసి చెప్పింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments