Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిసాలో భారీ ఎన్‌కౌంటర్... 23 మంది మావోయిస్టుల మృతి... గ‌ణేష్ కూడా?

మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దు (ఏవోబీ)లో మావోయిస్టుల ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గ్రేహౌం

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (13:31 IST)
మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దు (ఏవోబీ)లో మావోయిస్టుల ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గ్రేహౌండ్ పోలీసు బలగాలు నిన్నటి నుంచి కూంబింగ్ చేపట్టాయి. అయితే పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీ పెద్దన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ముఖ్య నేతలు గ‌ణేష్ అలియాస్ ఉదయ్, కిరణ్ చనిపోయినట్లు తెలుస్తోంది. గ‌జ్జ‌ర్ల ర‌వి అలియాస్ గ‌ణేష్ అలియాస్ ఉద‌య్ గ‌త 26 ఏళ్ళుగా అండ‌ర్‌గ్రౌండ్‌లో ఉన్నాడు. ఏపీ, ఒడిస్సాలో ప‌నిచేస్తూ, మావోయిస్టు గ్రూపులో సెక్ర‌టేరియేట్ మెంబ‌ర్‌గా కీల‌క నేత‌గా ఉన్నారు. ఆయ‌న‌పై 20 ల‌క్ష‌ల రూపాయ‌ల రివార్డు కూడా ఉంది. అలాగే తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
 
విశాఖ జిల్లా అరకు ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా విశాఖకు తరలించారు. ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments