Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నే నా గురువు.. రాజీనామాకు సిద్ధం... పార్టీలోనే ఉంటా: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. నాన్నే నా గురువు అని తేల్చిచెప్పారు. ఆయన తలచుకుంటే తనను సీఎం పీఠం నుంచ

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (12:55 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందించారు. నాన్నే నా గురువు అని తేల్చిచెప్పారు. ఆయన తలచుకుంటే తనను సీఎం పీఠం నుంచి దించవచ్చని గుర్తుచేశారు. అదేసమయంలో ఆయన కోరితే రాజీనామాకు సిద్ధమని, రాజీనామా చేశాక కూడా పార్టీలోనే కొనసాగుతానని అఖిలేష్ స్పష్టంచేశారు. 
 
సమాజ్‌వాదీ పార్టీలో రేగిన సంక్షోభం నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని అఖిలేష్ యాదవ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ములాయంసింగ్ యాదవ్ మాత్రమే తమ నాయకుడని ఆయన పునరుద్ఘాటించారు. పార్టీలో కొందరు కుట్రదారులు తయారయ్యారని ఆయన నేరుగా అమర్‌సింగ్‌పై ఆరోపణలు సంధించారు. 
 
అఖిలేష్ సీఎం కాదంటూ గత ఏడాది అమర్‌సింగ్ చేసిన వ్యాఖ్యలను అఖిలేష్ గుర్తుచేశారు. కుట్రను భగ్నం చేసితీరుతామని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తాను పార్టీ పెడుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తాను ఎప్పటికీ సమాజ్‌వాదీ పార్టీలోనే ఉంటానని అఖిలేష్ తేల్చిచెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments