Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలు వెంటనే మూసివేయాలి : మంత్రి సురేశ్‌

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (16:45 IST)
కరోనా కేసులు నమోదైన విద్యాసంస్థలు వెంటనే మూసివేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నారు.

ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్‌ క్యాలెండర్‌ గాడిలో పెట్టామని చెప్పారు. పెద్ద ఎత్తున కరోనా సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుందని, దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశామని పేర్కొన్నారు. కరోనా మళ్లీ పుంజుకుంటోందని, రెండు నెలలు జాగ్రత్త అవసరమని తెలిపారు.

రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని, కరోనా సోకినవారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతామని, ఆదివారాలు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments