Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం...

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (08:13 IST)
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరంతా ఆ యువతి స్నేహితుడి ఫ్రెండ్స్ కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవల ఫేర్‌వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత డిగ్రీ విద్యార్థిని ఒకరు స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లింది. 
 
ఇద్దరూ కలిసి సంగంపుంత కాలనీ వద్ద ఉన్న ఇటుక బట్టీ సమీపానికి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా నలుగురు యువకులు అక్కడికి చేరుకుని, యువతి స్నేహితుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయంపై బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై వల్లూరి రామకృష్ణ(కిట్టయ్య), సుంకర సత్యనారాయణ(వెంకన్న), చామంతి మధు, ములకల వీరబాబులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments