Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్.. నలుగురు మృతి

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (09:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. మృతులను కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ప్లెక్సీలు కడుతుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 
 
ప్లెక్సీలు కడుపుతున్న సమయంలోపైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి గ్రామానికి చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన కృష్ణ, నాగేంద్ర, మణికంఠ, వీర్రాజు అనే వారిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని ఉండ్రాజవరం పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments