Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

Advertiesment
gang rape

సెల్వి

, శనివారం, 2 నవంబరు 2024 (15:31 IST)
ఒడిశా ప్రాంతానికి చెందిన దంపతులు.. తమ ఇద్దరు పిల్లలను తీసుకుని పొట్టచేత పట్టుకుని నర్సరీలలో పనికి వచ్చారు. అప్పుడే గడ్డుకాలం ప్రారంభమైంది. ఒడిశాకు చెందిన ఈ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. 
 
ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కడియం పూల నర్సరీల్లో ఘోరం జరిగింది. రోజూ మాదిరిగా నర్సరీ పనికి వెళ్లి వస్తున్న ఓ వివాహితపై నలుగురు యువకులు మరో నర్సరీలోకి లాక్కెళ్లి అత్యాచారం చేయడంతో పాటు చంపేసి, గోదావరి కాలువలో పడేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బుర్రిలంకలో హైవేను ఆనుకుని ఉన్న ఓ నర్సరీలో నాలుగేళ్ల నుంచి వివాహిత (43) పని చేస్తోంది. గత నెల 15న సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, మరో నర్సరీలో పనిచేసే నలుగురు యువకులు ఆమెను బలవంతంగా నర్సరీ లోపలికి ఈడ్చుకుపోయి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తరువాత పక్కనే ఉన్న గోదావరి కాలువలో పడేశారు. కంగారుపడిన భర్త కడియం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో 16న మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 17వ తేదీన చొప్పెల్ల లాకుల వద్ద కాలువలో ఆమె మృతదేహం తేలింది.
 
ఆమె ఒంటిపై కేవలం లంగా మాత్రమే ఉంది. తలమీద జుట్టుకూడా లేకుండా గుండు చేసినట్టు ఉంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసి పోస్టుమార్టం చేయించారు.
 
అనంతరం ఆయా నర్సరీల యజమానులను, అక్కడ పనిచేసేవారందరినీ విచారించారు. పక్క నర్సరీలో పనిచేసే ఏసు అనే యువకుడు సంఘటన జరిగిన రోజు నుంచి పనికి రావడం మానేయడంతో అనుమానం వచ్చింది.. ఆరా తీస్తే నేరస్థుల గుట్టు రట్టయింది. 
 
దీంతో బుర్రిలంక గ్రామానికి చెందిన దేవర ఏసు (26), వెలుబుడి ప్రవీణ్ ‌(21), లోకిన జయప్రసాద్‌(19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష (21)ను 30వ తేదీన బుర్రిలంకలో అరెస్టు చేసి వివరాలు సేకరించారు. 
 
ఆమె కాళ్లూ చేతులు పట్టుకుని, నర్సరీ మొక్కల మధ్యకు తీసుకుని వెళ్లి నలుగురూ ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత హత్య చేశారని రాజమహేంద్రవరం సౌత్‌ జోన్‌ డీఎస్పీ భవ్యకిశోర్‌ తెలిపారు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని కాలువలోకి విసిరేసినట్టు విచారణలో తేలిందన్నారు. 
 
నలుగురినీ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచి 31న జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. సామూహిక అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్