Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నమ్మ పక్కలో నిద్రపోతున్న కుమార్తెను ఎత్తుకెళ్లి రేప్ చేసిన కన్నతండ్రి.. ఎక్కడ

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:20 IST)
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాయవరం మండలంలోని ఓ మారుమూల పల్లెలో అభంశుభం తెలియని మైనర్ బాలికపై కన్నతండ్రే లైంగికదాడికి పాల్పడ్డాడు. కన్నబిడ్డను అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ కామాంధుడే.. ఆ బాలిక శీలాన్ని చిదిమేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ లైంగికదాడి ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ శివారు గ్రామంలో తొమ్మిదో తరగతి చదివే ఓ బాలిక ఉంది. కొన్నేళ్ళ క్రితం ఆమె తల్లి చనిపోయింది. దీంతో హాస్టల్‌లో ఉంటూ, చదువుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి పండగ సెలవుల కోసం ఇంటికి వచ్చింది. ఇంట్లో తండ్రి, నాయనమ్మ ఉన్నారు. కూతురిపై ఎప్పటి నుంచో కన్నేసిన తండ్రి ఆదివారం రాత్రి నాయనమ్మ పక్కన పడుకున్న బాలికను ఎత్తుకు వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
అలాగే, సోమవారం రాత్రి కూడా మరోమారు ఇదే విధంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో బాలిక పక్కింటికి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి అక్కడికి వెళ్లి కుమార్తెను పంపమని పక్కింటివారితో గొడవకు దిగడంతో బాలిక వద్ద ఆరా తీయగా అసలు విషయం వెల్లడించింది. అంతే.. ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయిన గ్రామస్తులు ఆ కామాంధుడుకి దేహశుద్ధి చేసి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో రాయవరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం