Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి దుర్గ గుడి పట్టు వస్త్రాలు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:19 IST)
కాణిపాకంలో కొలువైన‌ స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా  విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి  శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఇంద్రకీలాద్రి  తరుపున ఆలయ కార్యనిర్వహణాధికారిణి డి.భ్రమరాంబ పట్టు వస్త్రములు సమర్పించారు. దుర్గ గుడి నుంచి ఆల‌య బృందం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చేరుకోగా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్,  కార్యనిర్వహణాధికారి ఎ.వెంకటేశు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ కోవిడ్ నిబందనలు పాటిస్తూ, పట్టు వస్త్రములతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం చేసుకున్నారు. విజ‌య‌వాడ నుంచి తీసుకెళ్లిన పట్టు వస్త్రాలు స్వామి వారికి సమర్పించారు. 
 
శ్రీ స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా,  స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, కార్యనిర్వహణాధికారి వెంకటేశు, దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారికి స్వామివారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదములు అందజేశారు. ఈ  కార్యక్రమంలో దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు లింగంభొట్ల దుర్గాప్రసాద్రు, ఆర్.శ్రీనివాస శాస్త్రి, ఆలయ అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు, ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments