Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అస‌లే వ‌ర్షాకాలం... విజ‌య‌వాడ‌లో పారిశుధ్యం మెరుగుపడాలి

Advertiesment
అస‌లే వ‌ర్షాకాలం... విజ‌య‌వాడ‌లో పారిశుధ్యం మెరుగుపడాలి
విజయవాడ , సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:05 IST)
విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో పారిశుధ్యం పనులు స‌క్ర‌మంగా చేయాల‌ని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కింది స్థాయి అధికారుల‌ను ఆదేశించారు. నగరంలోని కేదారేశ్వర పేట, ఎర్రకట్ట, చిట్టినగర్, అంబేద్కర్ రోడ్, భవానీపురం, హెడ్ వాటర్ వర్క్స్ తదితర ప్రాంతాలలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్  సోమవారం పర్యటించి, అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఎర్రకట్ట ప్రాంతంలో చేపట్టిన యు.జి.డి మెయిన్‌ పైపు లైన్ పనులు పూర్తి అయిన నేప‌ధ్యంలో సుమారు 360 మీటర్ల పొడవున 2 మీటర్ల వెడల్పున బి.టి రోడ్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి రోడ్ ప్యాచ్ వర్క్ పనులు సత్వరమే పూర్తి  చేయాల‌ని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
 
చిట్టినగర్ జంక్షన్ వ‌ద్ద చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకోడానికి, వెడ్డింగ్ షాప్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  భవానీపురం, అంబేద్కర్ రోడ్, ఆర్.టి.సి వర్క్ షాపు రోడ్, షాదీ ఖానా రోడ్ తదితర ప్రాంతాలలో క‌మిష‌న‌ర్ ప‌ర్య‌టించారు. ఆర్.టి.సి వర్క్ షాపు రోడ్ అభివృద్దికి  15వ ఆర్ధిక సంఘ నిధులతో  అంచనాలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. భవానీపురం ప్రాంతంలోని పలు విధులలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించి డంపర్ బీన్స్ వద్ద చెత్త కుప్పలుగా పడి ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. శానిటరీ అధికారులకు పలు సూచనలు చేస్తూ, యుద్ద ప్రాతిపదికన చెత్తనంతటిని తరలించాల‌ని ఆదేశించారు. 
 
కనకదుర్గమ్మ ప్లైవోర్‌ దిగువన హెడ్ వాటర్ వర్క్స్ వద్ద డ్రెయిన్ లో మురుగునీటి పారుదలకు అవరోధంగా ఉన్న సిల్ట్ పూర్తి స్థాయిలో తొలగించి మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చూడాలని అధికారులకు సూచించారు. అదే విధంగా హెడ్ వాటర్ వర్క్స్ లో లోతట్టు ప్రాంతములో వర్షపు నీరు నిలిచి ఉండ‌కుండా చర్యలు చేపట్టి పైపు లైన్ ద్వారా వర్షపు నీరు డ్రెయిన్ లో కలిసేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నారాయణమూర్తి, ఇంజనీరింగ్ మరియు శానిటరీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.    

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మూడో దశ అల వచ్చే అవకాశాలు చాలా తక్కువే : ఐసీఎంఆర్ సైంటిస్ట్